ఓ ప్రార్థన ఆమ్మ నన్ను తొమ్మిది నెలలు మోసి ఈ లోకంలోకి తెచ్హింది భూమి నన్ను ఎముకలుగా తనలో తొమ్మిది నెలల్లో మార్చి మిలియన్స్ సంవత్సరాలు దాచుకో గలదు ఆ ఎముకలుగా. కాని నేను ఒక రహస్యంగా మిగులుతాను. ఈ భూమి కథ అంతా చిత్రం ... విచిత్రం సెగలు క్రక్కుతూ నిప్పులు చిమ్ముతూ ఆకాశం అంటే జ్వాలలు తో వినీలాకాశం నుంచి ఉల్కాపాతం తో. ఆ బాంబుల వర్షం లొ తడుస్తూ చల్లబడి నీరు తో జీవానికి ఓ అవకాశం. ఏక కణ జీవులు ఎన్నో బహుకణ జీవులు ఎన్నో. చిత్ర విచిత్రమైన సృష్టి. జీవాలు పుట్టు తున్నాయి గిట్టు తున్నాయి. మనిషి అతి తెలివిగల మెకమై జీవుల గిట్టటాన్ని వేగవంతం చేస్తున్నాడు. కర్బన ఉద్గారలని అతిఎక్కువ చేసి జీవుల అంతరించి పోయేలా చేస్తున్నాడు. నాకు చరమ పదం వ్రాస్తున్నడు. నా సెగల్లో, నిప్పుల్లో, ఆకాశం అంటే జ్వాలల్లో తనూ అంతరిస్తాడు. నా చరమ గీతం మనిషి కూడా చరమ గీతం అవుతుందని తెలిసినా అఙ్జానంలో ఉన్న మనిషిని మనసారా ప్రార్ధిస్త్తున్నా- ఙ్జానివి కా అని.
ఓ ప్రార్థన
ఆమ్మ నన్ను తొమ్మిది నెలలు మోసి ఈ లోకంలోకి తెచ్హింది
భూమి నన్ను ఎముకలుగా తనలో తొమ్మిది నెలల్లో మార్చి
మిలియన్స్ సంవత్సరాలు దాచుకో గలదు ఆ ఎముకలుగా.
కాని నేను ఒక రహస్యంగా మిగులుతాను.
ఈ భూమి కథ అంతా చిత్రం ... విచిత్రం
సెగలు క్రక్కుతూ
నిప్పులు చిమ్ముతూ
ఆకాశం అంటే జ్వాలలు తో
వినీలాకాశం నుంచి ఉల్కాపాతం తో.
ఆ బాంబుల వర్షం లొ తడుస్తూ
చల్లబడి నీరు తో జీవానికి ఓ అవకాశం.
ఏక కణ జీవులు ఎన్నో
బహుకణ జీవులు ఎన్నో.
చిత్ర విచిత్రమైన సృష్టి.
జీవాలు పుట్టు తున్నాయి గిట్టు తున్నాయి.
మనిషి అతి తెలివిగల మెకమై
జీవుల గిట్టటాన్ని వేగవంతం చేస్తున్నాడు.
కర్బన ఉద్గారలని అతిఎక్కువ చేసి
జీవుల అంతరించి పోయేలా చేస్తున్నాడు.
నాకు చరమ పదం వ్రాస్తున్నడు.
నా సెగల్లో, నిప్పుల్లో, ఆకాశం అంటే
జ్వాలల్లో తనూ అంతరిస్తాడు.
నా చరమ గీతం మనిషి కూడా
చరమ గీతం అవుతుందని తెలిసినా
అఙ్జానంలో ఉన్న మనిషిని
మనసారా ప్రార్ధిస్త్తున్నా-
ఙ్జానివి కా అని.